DRDO INMAS Recruitment 2022: రూ. 54 వేల జీతంతో.. డీఆర్డీఓ – ఇన్మాస్లో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్డీఓ-న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (INMAS).. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో (Research Associate Posts) పోస్టుల..
DRDO – INMAS Delhi Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్డీఓ-న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (INMAS).. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో (Research Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రీసెర్చ్ అసోసియేట్లకు నెలకు రూ.54,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
- రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు కెమిస్ట్రీ/లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభం కూడా ఉండాలి.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
అడ్రస్: డీఆర్డీఓ-ఇన్మాస్, బ్రిగ్ ఎస్కే మజుందార్ మార్గ్, తిమార్పూర్, ఢిల్లీ.
ఇంటర్వ్యూ తేదీ: 2022, ఏప్రిల్ 8, 11 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: