TG Polycet 2025 Notification: తెలంగాణ పాలిసెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. రాత పరీక్ష ఎప్పుడంటే?

గతేడాది తెలంగాణ పాలీసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో వెలువరించారు. అయితే ఈ సారి కాస్త ఆలస్యంగా పాలీసెట్ ప్రకటన వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్థానికతపై స్పష్టత వచ్చిన వెంటనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసినా.. ప్రకటన జారీపై జాప్యం నెలకొంది..

TG Polycet 2025 Notification: తెలంగాణ పాలిసెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. రాత పరీక్ష ఎప్పుడంటే?
TG Polycet 2025 Exam Date
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2025 | 7:51 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మే 16వ తేదీన పాలిసెట్‌ నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ మొదలు ఫలితాల వెల్లడి వరకు పూర్తి షెడ్యూల్‌ను కూడా రూపొందించారు. స్థానికతకు సంబంధించి స్పష్టత వచ్చిన వెంటనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, కరీంనగర్‌ పాలిటెక్నిక్‌ తదితర కళాశాలల్లో 15 శాతం సీట్లను అన్‌ రిజర్వ్‌డ్‌ కింద కేటాయిస్తున్నారు. వాటికి ఏపీ విద్యార్థులు సైతం పోటీపడతారు. అయితే స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేయాల్సి ఉంది. ఇది అందిన వెంటనే వీటన్నిటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు కార్యచరణ సిద్ధంగా ఉన్నారు. కాగా గతేడాది ఫిబ్రవరి 15న పాలిసెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనితోపాటు ఈఏపీసెట్‌, ఐసెట్, లాసెట్‌ వంటి తదితర నోటిఫికేషన్ల జారీపై కూడా త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు.

నిఫ్ట్‌ యూజీ, పీజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. ఫిబ్రవరి 9న పరీక్ష

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) 2025 యూజీ, పీజీ ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంట్రన్స్‌ టెస్ట్‌కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి వివరాలు పొందవచ్చు. ఫిబ్రవరి 9వ తేదీన రెండు షిప్టుల్లో ఈ పరీక్ష జరగనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 18 క్యాంపస్‌లల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మరో రెండు రోజుల్లో హాల్‌ టికెట్లు కూడా జారీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.