TG DSC 2024 Result Date: సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత.. త్వరలోనే ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు జులై 18వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. తొలిసారి డీఎస్సీ పరక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2,79,966 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. డీఎస్సీ పరీక్షల ఫలితాలు కూడా..

TG DSC 2024 Result Date: సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత.. త్వరలోనే ఫలితాలు
appointment orders to DSC candidates
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2024 | 4:56 PM

హైదరాబాద్‌, జులై 27: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు జులై 18వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. తొలిసారి డీఎస్సీ పరక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2,79,966 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. డీఎస్సీ పరీక్షల ఫలితాలు కూడా త్వరగానే విడుదల చేసి సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మూడు ఉపాధ్యాయ సంఘాల నేతలు సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సంఘాల నేతలు పలు సమస్యలను నరేందర్‌రెడ్డికి విన్నవించారు. వీటిపై ఆయన మాట్లాడుతూ.. బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన పొరపాట్లను సవరించేందుకు జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. సీఎంతో చర్చించి రుణమాఫీలు ముగిసిన వెంటనే.. డీఏలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికుల నియామకం, ఉచిత విద్యుత్తుపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామన్నారు. మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ బదిలీల్లో న్యాయపరమైన చిక్కుల తొలగింపుకు చొరవ తీసుకుంటామన్నారు. అలాగే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చిస్తుందని తెలిపారు.

ఏపీ డిగ్రీ ప్రవేశాల్లో వెబ్‌ ఐచ్ఛికాలు ఆగిపోయాయ్‌..

ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ ప్రవేశాలకు జులై 26న వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే రోజంతా ప్రయత్నించినా.. సంబంధిత వెబ్‌సైట్‌ మాత్రం ఓపెన్‌ కాలేదు. దీంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. ఉన్నత విద్యామండలి డిగ్రీకి సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీసీఏ, బీబీఏ కోర్సులకు ఫీజులు ఖరారు కాలేదు. ఈ కారణంతో వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించలేదు. అయితే ఈ విషయం తెలియక విద్యార్థులు శుక్రవారం నాడు రోజంతా కంప్యూటర్ల ముందు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు వెబ్‌ ఐచ్ఛికాలకు సంబంధించిన సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టడంతో విద్యార్ధులు వెనుదిరిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.