TG govt Jobs 2025: నిరుద్యోగులకు సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కోర్టుల్లో 960 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్
సత్వర న్యాయం, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కొత్త కోర్టులను ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు కొత్త పోస్టులు కూడా మంజూరు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్తగా కోర్టుల ఏర్పాటుకు తీర్మాణం తీసుకుంది. వీటిల్లో వివిధ కేటగిరీల్లో..

హైదరాబాద్, నవంబర్ 21: సత్వర న్యాయం, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కొత్త కోర్టులను ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు కొత్త పోస్టులు కూడా మంజూరు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొత్తగా కోర్టుల ఏర్పాటుకు తీర్మాణం తీసుకుంది. వీటిల్లో వివిధ కేటగిరీల్లో మొత్తం 960 పోస్టుల భర్తీకి చేస్తూ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. జిల్లా న్యాయవ్యవస్థలో భాగంగా 23 అదనపు కోర్టు మేనేజర్ పోస్టులు వస్తున్నాయి. మరిపెడలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ మొదటి తరగతి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో భాగంగా వివిధ కేటగిరీల్లో 27 పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపింది.
మరోవైపు హనుమకొండ, హుజూర్‌నగర్, సుల్తానాబాద్, దేవరకద్ర, భీమ్‌గల్, సంగారెడ్డి, భూపాల్‌పల్లిల్లో వివిధ స్థాయుల్లో 9 కోర్టులు ఏర్పాటు చేస్తుంది. వీటిల్లో మొత్తం 196 పోస్టులను మంజూరు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థాయిలో 28 కోర్టులకు 617 పోస్టులను మంజూరు చేసింది. సెషన్స్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు 8, అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కమ్ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు 20 చొప్పున ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 5 ఫస్ట్‌క్లాస్ కోర్టులకు 97 పోస్టుల మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు మొత్తం 960 పోస్టులను ఆయా కోర్టుల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




