AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Half Day Schools: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. రేపట్నుంచే ఒంటిపూట బడులు! కొత్త టైమింగ్స్ ఇవే

ఎండల తీవ్రత దృష్ట్యా సాధారణంగా మార్చి 15వ తేదీ నుంచి యేటా విద్యార్ధులకు ఒంటి పూట బడులు ఇస్తుంటారు. కానీ తెలంగాణలో ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులు ఇస్తూ విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. దీంతో విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డులు రేపట్నుంచే అమలు చేయనున్నారు..

Half Day Schools: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. రేపట్నుంచే ఒంటిపూట బడులు! కొత్త టైమింగ్స్ ఇవే
Half Day Schools
Srilakshmi C
|

Updated on: Mar 02, 2025 | 8:05 AM

Share

హైదరాబాద్‌, మార్చి 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. రంజాన్‌ ప్రారంభ నేపథ్యంలో ఉర్దూ విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డులు నిర్వహించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడి పిల్లలకు మార్చి 15వ తేదీ నుంచి యేటా ఒంటి పూట బడులు ఇస్తుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్తముందుగానే ప్రభుత్వం ఒంటి పూట బడులు ప్రకటించింది. దీంతో మార్చి 3వ తేదీ నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్‌ 1 వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టుగా సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో విద్యార్ధులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పిల్లలకు తరగతులు నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర పాఠశాలలోని ఉర్దూ మీడియం విభాగాలు, DIET కాలేజీల్లోని ఉర్దూ మీడియం విభాగాలకు తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

మరోవైపు రంజాన్‌ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు షాప్‌లు 24 గంటలు తెరిచి ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు పనివేళలను ఒక గంట తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందుగానే కార్యాలయాలు, పాఠశాలల నుంచి బయలుదేరడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ముస్లీం ఉద్యోగులకు ప్రభుత్వం ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎప్పటినుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి