AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Memo: పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

తెలంగాణ పదో తరగతి మార్కుల మెమోలను ఎట్లా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తెగ ఆలోచిస్తుంది. పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ.. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను మార్కులా? లేదా గ్రేడింగా? ఎలా ముద్రించాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంది..

SSC Memo: పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన
SSC Memo
Srilakshmi C
|

Updated on: Feb 25, 2025 | 10:23 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే పదో తరగతి పరీక్షల అనంతరం రిజల్ట్స్‌ గ్రేడింగ్‌లో ఇవ్వాలా? లేదా మార్కులు ఇవ్వాలా? అనే దానిపై విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతుంది.

మార్కుల మెమోలను ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తల బాదుకుంటుంది. దీనిపై సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హెచ్‌ఎంలు, నిపుణులతో సోమవారం సమావేశం జరిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానాన్ని ఎత్తి వేశారు. గతంలో మార్కుల విధానం అమలైనప్పుడు విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌, థర్డ్‌ క్లాస్‌, పాస్‌ అని మెమోలపై ముద్రించేవారు. అలాగే మార్కులతోనే టెన్త్‌ మెమోలను ముద్రించాల్సి ఉంటుంది.

అయితే ఈ పాత విధానాన్ని కొనసాగించాలా? లేదా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ముద్రించాలా? అన్న దిశగా చర్చలు సాగించారు. వీటిపై ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు వాటిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే తదనుగుణంగా టెన్త్‌ మెమోలను ముద్రించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే