TS DOST 2024 Schedule: తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మే 6 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు..

TS DOST 2024 Schedule: తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మే 6 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం
TS DOST 2024 Schedule

Edited By:

Updated on: May 03, 2024 | 3:36 PM

హైదరాబాద్‌, మే 3: తెలంగాణ దోస్త్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కాలేజీల్లో  వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి

మొదటి విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మే 25వ తేదీతో తొలి విడత రిజిస్ట్రేషన్‌ ముగుస్తుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇక మే 15 నుంచి 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 3వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి అదేనెల 10వ తేదీ లోపు సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టు చేయవల్సి ఉంటుంది.

రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూన్‌ 4 నుంచి 13వ తేదీవరకు కొనసాగుతుంది. రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ చేసుకోవాలి. జూన్‌ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మూడో విడత ప్రక్రియ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 19 నుంచి జూన్‌ 25 వరకు ఉంటుంది. జూన్‌ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలి. జూన్‌ 29న సీట్లను కేటాయిస్తారు. జూన్‌ 29 నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. మూడో విడుత రిజిస్ట్రేషన్లకు మాత్రం విద్యార్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. జూలై 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఎవరైనా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలంటే దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.