12 ఏళ్లలో టెట్‌లో అర్హత పొందని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీల్లేదు: హైకోర్టు

12 ఏళ్లలో టెట్‌లో అర్హత పొందని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీల్లేదు: హైకోర్టు
Tn High Court

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)లో అర్హత సాధించని వారు టీచర్‌ వృత్తిలో కొనసాగడానికి అర్హత లేదని మద్రాసు హైకోర్టు గురువారం (ఏప్రిల్ 7) తెలిపింది..

Srilakshmi C

|

Apr 09, 2022 | 10:25 AM

Teacher Eligibility Test qualification mandatory for teachers: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)లో అర్హత సాధించని వారు టీచర్‌ వృత్తిలో కొనసాగడానికి అర్హత లేదని మద్రాసు హైకోర్టు గురువారం (ఏప్రిల్ 7) తెలిపింది. కేంద్ర విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులుగా నియమితులయ్యే వారు టెట్‌లో 60% మార్కులు సాధించాలని 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో 2011కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్‌లో అర్హత పొందలేదని, వారికి వేతన పెంపును నిలిపేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలుచేస్తూ ఉపాధ్యాయుల తరఫున దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కృష్ణకుమార్‌ ఏప్రిల్ 7న‌ విచారణ చేపట్టారు. అప్పుడు 12 ఏళ్లు అవకాశం కల్పించినా టెట్‌లో అర్హత పొందనివారికి వేతన పెంపు పొందే హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.

కానీ టెట్‌ ఏటా జరగడం లేదని పిటిషనర్ల తరఫున తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విద్యాహక్కు చట్టం కింద టెట్‌లో అర్హత పొందాలని ప్రకటించి, 12 ఏళ్లు దాటినా అర్హత పొందని ఉపాధ్యాయులకు వేతన పెంపు పొందే హక్కు లేదని తెలిపి కేసు కొట్టేశారు. అలాగే, టెట్‌లో అర్హత పొందని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీల్లేదన్నారు. ఏటా టెట్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

TS SSC 2022 Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి అవకాశం! ఎప్పటివరకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu