AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: ‘రేపటి నుంచి మొదలుపెడతా’ అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనా విధానం మారుస్తుంది!

జీవితంలో చాలాసార్లు మనం 'తర్వాత చేస్తాను.. రేపటి నుంచి మొదలుపెడతాను' అంటూ పనులను వాయిదా వేస్తుంటాం. మనకు మనమే ఇంకా చాలా సమయం ఉందని సర్దిచెప్పుకుంటాం. కానీ ఇదే చిన్న అలవాటు క్రమంగా మన లక్ష్యాలకు, కలలకు దూరం చేస్తుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో అంతులేని సోషల్ మీడియా స్క్రోలింగ్, వరుస నోటిఫికేషన్లు, వినోదం వంటి పరధ్యానాల మధ్య సమయం ఎలా గడిచిపోతుందో కూడా మనకు తెలియదు. అయితే సమయం అంటే కేవలం గడియారంలో టిక్‌టిక్‌ మనే శబ్దం కాదు.. మన భవిష్యత్తును నిర్ణయించే అత్యంత విలువైన సంపద. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు విజయాన్ని అందుకుంటారు. దాన్ని నిర్లక్ష్యం చేసినవారు చివరకు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథ తెలుసుకుందాం..

Life Lesson: 'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనా విధానం మారుస్తుంది!
Powerful Story About Time Management
Srilakshmi C
|

Updated on: Oct 08, 2026 | 11:39 AM

Share

ఒక చిన్న గ్రామంలో ఓ బాలుడు ఉండేవాడు. అతడు చాలా సోమరి. ఏ పని చెప్పినా వెంటనే చేయకుండా ‘తర్వాత చేస్తాను’ అంటూ వాయిదా వేయడం అతడికి అలవాటు. దీంతో చదువులోనూ, జీవితంలోనూ క్రమంగా వెనుకబడిపోయాడు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఎన్నిసార్లు సమయం విలువ గురించి చెప్పినా అతడు పట్టించుకునేవాడు కాదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పనికిరాని విషయాలతో సమయాన్ని గడిపేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఓ జ్ఞాని వచ్చాడు. జ్ఞానం, వివేకానికి ఆయన ఎంతో ప్రసిద్ధుడు. చాలామంది ఆయనను కలిసి సలహాలు తీసుకునేవారు. ఆ జ్ఞాని గురించి తెలుసుకున్న బాలుడు కూడా ఆయనను కలిసి తన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు పార్కులో జ్ఞాని కొందరితో మాట్లాడుతుండగా బాలుడు అక్కడికి వెళ్లాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లి.. ‘గురువుగారూ.. నేను జీవితంలో విఫలుడిననే భావన కలుగుతోంది. నా స్నేహితులు, సహ విద్యార్థులందరి కంటే నేను వెనుకబడి ఉన్నాను. నేను కూడా విజయం సాధించాలనుకుంటున్నాను. అందుకు ఏం చేయాలో చెప్పండి’ అని అడిగాడు.

జ్ఞాని చిరునవ్వుతో బాలుడి వైపు చూసి.. ‘నువ్వు వెనుకబడటానికి ప్రధాన కారణం నీకు సమయం విలువ తెలియకపోవడమే. పనులను వాయిదా వేస్తూ విలువైన క్షణాలను కోల్పోతున్నావు’ అని చెప్పారు. ఆ తర్వాత సమయం విలువను అర్థం చేసుకునేలా ఓ కథ చెప్పడం ప్రారంభించారు.

రాజు ఇచ్చిన అపూర్వమైన అవకాశం

పూర్వం ఓ దయగల రాజు ఉండేవాడు. ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. అవసరమైన వారికి ఎప్పుడూ సహాయం చేసేవాడు. ఒకరోజు తన పాత స్నేహితుడిని కలిశాడు. అతడు ఒకప్పుడు రాజుకు సహ విద్యార్థి. కానీ ఇప్పుడు పేదరికంలో ఉన్నాడు. ఉద్యోగం లేకపోవడంతో పాటు సమాజంలో గౌరవాన్ని కూడా కోల్పోయాడు. తన పరిస్థితికి ఎప్పుడూ ఇతరులనే నిందించేవాడు. తన తప్పులను మాత్రం అంగీకరించేవాడు కాదు. రాజు అతడిని చూసి బాధపడి దగ్గరకు పిలిచి అతని పరిస్థితి గురించి అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి.. ‘మహారాజా.. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రతిసారీ తిరస్కరిస్తున్నారు. నేను పనులను సమయానికి పూర్తి చేయనని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అని చెప్పాడు. రాజు కాసేపు ఆలోచించి అతడికి ఓ అవకాశం ఇచ్చాడు. ‘ఈరోజు సూర్యాస్తమయం లోపు నా రాజ ఖజానాకు వెళ్లి నీకు కావాల్సినంత బంగారం, ఆభరణాలు తీసుకెళ్లవచ్చు. నువ్వు తీసుకున్నదంతా నీదే’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహితుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి పరుగెత్తాడు. అవకాశం వచ్చింది.. కానీ సమయాన్ని వృథా చేశాడు!

ఇవి కూడా చదవండి

ఇంటికి వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషించి.. ‘మరి ఆలస్యం ఎందుకు? వెంటనే రాజభవనానికి వెళ్లండి. సంపదను తీసుకురండి’ అని చెప్పింది. కానీ అతడు.. ‘నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు భోజనం చేస్తాను’ అన్నాడు. భార్య వెంటనే భోజనం సిద్ధం చేసింది. కానీ అతడు తొందరపడకుండా నెమ్మదిగా తిన్నాడు. తనకు ఇంకా చాలా సమయం ఉందని అనుకున్నాడు. భోజనం తర్వాత నిద్ర ముంచుకొచ్చింది. ‘కొద్దిసేపు నిద్రపోయి తర్వాత వెళ్తాను’ అని అనుకుని మంచంపై పడుకున్నాడు. ధనవంతుడిగా మారబోతున్నాననే కలలు కంటూ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రెండు గంటల తర్వాత భార్య అతడిని నిద్రలేపింది. అప్పటికీ మధ్యాహ్నమే కావడంతో అతడు తనను ఎందుకు తొందరగా లేపావంటూ ఆమెపై కోపగించుకున్నాడు. చివరకు కొన్ని సంచులు తీసుకుని రాజభవనం వైపు బయలుదేరాడు. బయట ఎండ చాలా తీవ్రంగా ఉంది. కొంత దూరం నడిచిన తర్వాత అతడికి అలసటగా అనిపించింది. ‘ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్తాను’ అనుకున్నాడు. చెట్టు కింద చల్లటి గాలి ఆహ్లాదకరంగా వీచింది. కాసేపటికే అతడికి నిద్ర పట్టింది. ఈసారి నిద్ర మరింత గాఢంగా వచ్చింది.

చివరకు అతడు మేల్కొనే సరికి సాయంత్రం అయిపోయింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాను చేసిన తప్పు అర్థమైన వెంటనే రాజభవనం వైపు పరుగెత్తాడు. కానీ అప్పటికే రాజభవనం తలుపులు మూసివేశారు. అతడికి దక్కిన అద్భుతమైన అవకాశం అతడి కళ్ల ముందే చేజారిపోయింది. అది దురదృష్టం వల్ల కాదు. సమయానికి విలువ ఇవ్వకపోవడం వల్ల.

కథ విన్న బాలుడిలో మార్పు

కథ ముగించిన తర్వాత జ్ఞాని బాలుడి వైపు చూశాడు. బాలుడు మౌనంగా ఉండిపోయాడు. జ్ఞాని చెప్పిన కథలో తన జీవితాన్ని చూసుకున్నాడు. తాను కూడా ఇదే విధంగా పనులను వాయిదా వేస్తూ విలువైన సమయాన్ని కోల్పోతున్నానని అర్థం చేసుకున్నాడు. జ్ఞానికి కృతజ్ఞతలు తెలిపి ఇకపై మారతానని మాట ఇచ్చాడు. ఆ రోజు నుంచి అతడు పనులను వాయిదా వేయడం మానేశాడు. సమయానికి పనులు పూర్తి చేయడం ప్రారంభించాడు. కష్టపడి చదివాడు. తన లక్ష్యాలపై దృష్టి పెట్టాడు. కొంతకాలానికి అతడి జీవితంలో మార్పు కనిపించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడిని గౌరవించడం ప్రారంభించారు. అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఒక్కటే.. సమయం అమూల్యమైనది. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. వస్తువులు పోతే తిరిగి కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం. ఒక నిమిషం ఆలస్యంగా వెళ్లి రైలును కోల్పోయిన ప్రయాణికుడికి ఆ ఒక్క నిమిషం విలువ తెలుస్తుంది. పరీక్షలో విఫలమైన విద్యార్థికి ఒక సంవత్సరం విలువ తెలుస్తుంది. అదేవిధంగా, జీవితంలో ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తికి సమయం విలువ మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ‘తర్వాత చేస్తాను.. రేపటి నుంచి మొదలుపెడతాను’ అనే మాటలను వీలైనంత వరకు దూరం పెట్టాలి. మీకు చేయాల్సిన పని ఏదైనా ఉంటే ఈరోజే ప్రారంభించండి. చిన్న అడుగైనా సరే ముందుకు వేయండి. మీ కలలు, లక్ష్యాల కోసం సమయాన్ని కేటాయించండి. కుటుంబంతో విలువైన క్షణాలను గడపండి. స్నేహితులతో ఆనందాన్ని పంచుకోండి. ఎందుకంటే చివరికి మన జీవితాన్ని నిర్మించేది మన దగ్గర ఉన్న సమయం. సమయాన్ని గౌరవిస్తే అది మన జీవితాన్ని మార్చుతుంది. సమయాన్ని వృథా చేస్తే అదే సమయం మన చేతుల్లోంచి అవకాశాలను లాక్కుంటుంది. కాబట్టి.. సమయం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. రేపటి కోసం ఎదురుచూడకుండా.. మీ మార్పును ఈరోజే ప్రారంభించండి.

Follow Us
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్