AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC STENO 2025 Exam Dates: ఎస్‌ఎస్‌సీ స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్షలు పూర్తవగా స్కిల్‌ టెస్ట్‌ ఈ నెలాఖరులో జరగనుంది. ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీలను ఎస్సెస్సీ విడుదల చేసింది..

SSC STENO 2025 Exam Dates: ఎస్‌ఎస్‌సీ స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC Stenographer 2025 Skill Test Exam Dates
Srilakshmi C
|

Updated on: Jan 22, 2026 | 2:55 PM

Share

హైదరాబాద్‌, జనవరి 22: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్షలు పూర్తవగా స్కిల్‌ టెస్ట్‌ ఈ నెలాఖరులో జరగనుంది. ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీలను ఎస్సెస్సీ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు జనవరి 28, 29 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించి నైపుణ్య పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్కిల్‌ టెస్ట్‌కు మొత్తం 8,624 మంది గ్రేడ్‌ సికు, 22,456 మంది గ్రేడ్‌ డికు అర్హత సాధించారు.

కాగా దేశవ్యాప్తంగా ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. మొత్తం 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్‌ డి పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఎస్‌ఎస్‌సీ స్టెనో స్కిల్‌ టెస్ట్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీఓ 2025 మెయిన్స్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్స్ (RRB) ఆఫీసర్ స్కేల్ I, II ,III మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు స్కోర్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ రోల్‌ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి ద్వారా ఫలితాలను పొందవచ్చు. మార్కుల వివరాలు తెలుసుకోవడానికి జనవరి 27, 2026 వరకు అవకాశం కల్పించారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత లింక్ అందుబాటులో ఉండదని ఐబీపీఎస్ స్పష్టం చేసింది.

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీఓ 2025 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!