AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్‌ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం..

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు
SSC GD Constable Jobs
Srilakshmi C
|

Updated on: Jun 14, 2024 | 7:34 AM

Share

న్యూఢిల్లీ, జూన్‌ 14: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్‌ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ కానున్నాయి.

ఈ పోస్టులన్నింటినీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తారు. వీటితోపాటు అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు కూడా ఇందులోనే భర్తీ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ ఏప్రిల్‌ 3న విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. త్వరలోనే ఈ పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. రాత పరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌లు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు ఇవే..

కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)లో మొత్తం 46,617 పోస్టులు ఉన్నాయి.

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)లో మొత్తం 12,076 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 10227, మహిళలకు 1849 పోస్టులు ఉన్నాయి.
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌)లో మొత్తం 13,632 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 11,558, మహిళలకు 2,074 పోస్టులు ఉన్నాయి.
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లో 9,410 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 9,301, మహిళలకు 109 పోస్టులు ఉన్నాయి.
  • సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ)లో 1,926 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 1,884, మహిళలకు 42 పోస్టులు ఉన్నాయి.
  • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో 6,287 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 5,327, మహిళలకు 960 పోస్టులు ఉన్నాయి.
  • అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో 2,990 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 2,948, మహిళలకు 42 పోస్టులు ఉన్నాయి.
  • సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో 296 పోస్టులు ఉండగా.. వీటిల్లో పురుషులకు 222, మహిళలకు 74 పోస్టులు ఉన్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ