NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్ మార్కులు రద్దు! రెండోసారి నీట్ యూజీ పరీక్షకు సన్నాహాలు
ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి పలు వైద్య కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పలు వివాదాల్లో చిక్కుక్కుకుంది. పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లను అత్యున్నత ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలో గురువారం సుప్రీంకోర్టుకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ..
న్యూఢిల్లీ, జూన్ 14: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి పలు వైద్య కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పలు వివాదాల్లో చిక్కుక్కుకుంది. పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లను అత్యున్నత ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలో గురువారం సుప్రీంకోర్టుకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1563 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వివరించింది. ఈ నిర్ణయం అస్సాంలోని నీట్ అభ్యర్ధులకు ఉపశమనం కలిగిస్తుందని తెల్పుతూ శుక్రవారం (జూన్ 14) ప్రకటన వెలువరించింది.
గ్రేస్ మార్కులు తొలగించిన అభ్యర్ధులు మళ్లీ నీట్ పరీక్ష రాయొచ్చు.. లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా వారి ర్యాంకును కొనసాగించవచ్చని ఎన్టీయే తన ప్రకటనలో వివరించింది. సంబంధిత విద్యార్థులకు జూన్ 23న పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా నీట్ (యూజీ) పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..
నీట్ యూజీ 2024 పరీక్ష ఈ ఏడాది మే 5న జరిగింది. అయితే పరీక్ష రోజున మేఘాలయకు చెందిన కొందరు విద్యార్ధులకు తప్పు ప్రశ్నాపత్రాలు అందించారు. మూడు గంటల సమయంలో పరీక్ష ప్రారంభమైన దాదాపు గంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారికి సరైన ప్రశ్నాపత్రాలు అందాజేశారు. వారంతా మిగతా రెండు గంటల సమయంలో పరీక్ష రాశారు. అయితే వారు కోల్పోయిన గంట సమయానికి గానూ పరిహారంగా ఎన్టీయే గ్రేస్ మార్కులు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4500 పరీక్ష కేంద్రాల్లో 6 కేంద్రాల్లో ఇలా తప్పుడు ప్రశ్నాపత్రాలు సరఫరా అయ్యాయి. ఈ ఆరు కేంద్రాలకు కేంద్రం గ్రేస్ మార్కులు ప్రకటించడంతో ఒక్కసారిగా ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా గ్రేస్ మార్కులు తొలగించి, ఆ 1563 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం చెప్పడంతో నీట్ అభ్యర్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల తమ ర్యాంకులు మెరుగుపడతాయని, మంచి కాలేజీలో సీటు పొందేందుకు అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.