SSC GD Constable Results: కేంద్ర బలగాల్లో 46,617 కానిస్టేబుల్ కొలువులు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డౌన్‌లోడ్‌ లింక్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు క్వశ్చన్‌ పేపర్‌, ఫైనల్ ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జులై 24వ తేదీ వరకు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం..

SSC GD Constable Results: కేంద్ర బలగాల్లో 46,617 కానిస్టేబుల్ కొలువులు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే
SSC GD Constable Results
Follow us

|

Updated on: Jul 11, 2024 | 6:47 AM

న్యూఢిల్లీ, జులై 11: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డౌన్‌లోడ్‌ లింక్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు క్వశ్చన్‌ పేపర్‌, ఫైనల్ ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జులై 24వ తేదీ వరకు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ కానున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. తర్వాత జర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారు.

ఎస్సెస్సీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాల లిస్ట్ 1 కోసం క్లిక్‌ చేయండి.

ఎస్సెస్సీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాల లిస్ట్ 2 కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎస్సెస్సీ క్వశ్చన్‌ పేపర్, ఫైనల్‌ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులన్నింటినీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తారు. వీటితోపాటు అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు కూడా ఇందులోనే భర్తీ చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.