SSC Sub-Inspector Jobs 2025: పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు
SSC Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination 2025: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం..

ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో.. సబ్-ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3,073 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ) సీఏపీఎఫ్ (మేల్ &ఫీమేల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పురుషలు ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 165 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. చెస్ట్ 80 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. ఇక అభ్యర్ధుల వయోపరిమితి 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి 5 ఏళ్లు, ఓబీసీ కేటగిరీకి 3 ఏళ్లు, ఈఎస్‌ఎం కేటగిరీకి 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్త కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎలంటి ఫీజు లేదు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఎస్‌టీ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్ లు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2025.
- దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: అక్టోబర్ 17, 2025.
- ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణ తేదీలు: అక్టోబర్ 24 నుంచి 26 వరకు, 2025.
- రాత పరీక్ష తేదీ: నవంబర్-డిసెంబర్, 2025లో నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




