AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Jobs 2025: నిరుద్యోగులకు భలే న్యూస్.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే సింగరేణిలో ఉద్యోగాలు

SCCL Apprentice Recruitment 2025 Notification: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ శనివారం (డిసెంబర్‌ 6) నోటిఫికేషన్​ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం రిజర్వేషన్ పద్ధతిన అవకాశాన్ని కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు..

Singareni Jobs 2025: నిరుద్యోగులకు భలే న్యూస్.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే సింగరేణిలో ఉద్యోగాలు
Singareni Apprenticeship Jobs
Srilakshmi C
|

Updated on: Dec 08, 2025 | 4:10 PM

Share

నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సింగరేణి సంస్థ శనివారం (డిసెంబర్‌ 6) నోటిఫికేషన్​ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం రిజర్వేషన్ పద్ధతిన అవకాశాన్ని కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాఫీలను జత చేసి సమీపంలోని ఏరియా ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో అందజేయాల్సి ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అభ్యర్థులను మాత్రమే స్థానికులుగా గుర్తిస్తారని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

అభ్యర్థుల సీనియారిటీ ప్రాతిపదికన అవకాశాన్ని ఇస్తారు. ఒకే సంవత్సరం ఉత్తీర్ణులైతే వారి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్​ వర్గాలకు 33 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతలు, సీనియారిటీ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను సింగరేణి వెబ్‌సైట్లో, ప్రధాన కార్యాలయంలోని నోటీసుబోర్డులో ఉంచుతారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మిషనిస్టు, మెకానిక్‌ మోటార్‌వెహికిల్, డ్రాఫ్ట్స్‌మెన్, డీజిల్‌ మెకానిక్, వెల్డర్‌ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారిని ఏడాది కాలపరిమితికి అప్రెంటిన్​షిప్‌ కేటాయిస్తారు. అలాగే రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్​, టర్నర్​, ఫిట్టర్​, మిషనిస్టు, మెకానిక్​ మోటార్​ వెహికిల్​, డ్రాఫ్ట్‌మెన్‌లకు రూ.8,050, ఐటీఐ పూర్తి చేసిన డీజిల్​ మెకానిక్​, వెల్డర్లకు రూ.7700 చొప్పున స్టైఫండ్​ చెల్లిస్తారు. ఏడాదిపాటు ఈ ట్రైనింగ్‌ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 25, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

సమీపంలోని ఎంవీటీసీలకు హార్డ్​కాపీలను సమర్పించేందుకు చివరి తేదీ : 08.10.25 నుంచి 25.12.2025 వరకు తొలుత అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్​ చేసుకోవాలి. ఆ తర్వాత సింగరేణి వెబ్‌సైట్‌లో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసుకోవాలి. scclmines.com నింపిన దరఖాస్తు కాపీతోపాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్‌కార్డుతో కలిపి సమీపంలోని ఏరియా ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (MVTC)లలో డిసెంబర్ 25, 2025లోగా సమర్పించాలి.ఔ

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.