Singareni Recruitment: సింగరేణి కేలరీస్‌ కంపెనీలో క్లర్క్‌ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Singareni Recruitment: తెలంగాణలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సింగరేణి కేలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) కూడా పలు పోస్టుల భర్తీకి..

Singareni Recruitment: సింగరేణి కేలరీస్‌ కంపెనీలో క్లర్క్‌ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Singareni Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 04, 2022 | 1:15 PM

Singareni Recruitment: తెలంగాణలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సింగరేణి కేలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) కూడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 155 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో 95 శాతం ఖాళీలను సింగరేణి పనులు జరుగుతున్న 4 జిల్లాల్లోని ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులకు, మిగిలిన 5 శాతం పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతోన్న అభ్యర్థుల ద్వారా భర్తీ చేస్తారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అండర్‌ గ్రౌండ్‌ వర్కర్లలో ఏడాదికి 190 మస్టర్లు పూర్తి చేసినవారు, సర్ఫేస్‌ వర్కర్స్‌లో ఏడాది 240 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు. వీటితో పాటు ఆరు నెలల సర్టిఫికేషన్‌తోపాటు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్స్‌లో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఈ పరీక్షలో 85 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 15 మార్కులకు అసెస్‌మెంట్‌ నివేదిక ఉంటుంది. రెండింటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 10-06-2022 చివరి తేదీకాగా, దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపించడానికి 25-05-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..