SEBI Recruitment 2022: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సెబీ..
నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెక్యూరిటీస్ మార్కెట్..
నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెక్యూరిటీస్ మార్కెట్ ఆపరేషన్స్ (SMO), లా, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం ఖాళీలను వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 25 జనవరి 2022. నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. సెబీ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కింద అభ్యర్థులు మొదట ఒక సంవత్సరం పాటు నియమితులవుతారు. దీని తరువాత ఈ వ్యవధిని ఒక్కొక్కటి ఒక సంవత్సరం పొడిగించే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల పనితీరుపై ఆధారపడి ఈ నిర్ణయం ఉంటుంది. సెబీ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా CA/CMAలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి లేదా CFAలోని మూడు స్థాయిల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. ప్రొఫెషనల్ (లా) అభ్యర్థులకు కనీసం 60% మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీతోపాటు ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసి ఉండాలి. వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను కూడా కోరింది. వయస్సు 30 ఏళ్లు మించకూడదు.. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చూడాలని సూచించింది.
జీతం
యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్‌లో ఎంపికైన తర్వాత అభ్యర్థికి నెలకు 60 వేల రూపాయల జీతం లభిస్తుంది. అలాగే, ముంబై వెలుపలి అభ్యర్థులకు అవసరాన్ని బట్టి వసతి సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అభ్యర్థి ఒక డొమైన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఒకే / వేర్వేరు డొమైన్‌ల క్రింద ఉన్న వేరు వేరు అప్లికేషన్‌లు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే ఛాన్స్ ఉంది.
ఎంపిక ప్రక్రియ
చేసిన దరఖాస్తు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే రెండు ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటి ప్రీ-ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను చివరి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ తర్వాత తదుపరి ప్రక్రియ ఉంటుంది.
ఇవి కూడా చదవండి: అదిరిపోయే బంపర్ ఆఫర్.. FDలో కంటే ఎక్కువ లాభం.. రిచ్ లోన్ NCDలలో 11 శాతం రాబడి..
Bulli Bai Case: బుల్లీ బాయ్ యాప్ వెనకున్న సూత్రధారి ఈమెనా? ఇంకెవరైనా ఉన్నారా..?