Schools reopening today 2022: నేటి నుంచి దేశంలో ఈ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభం.. అక్కడ ఇంకా లాక్‌డౌన్‌లోనే!

దేశంలో కరోనావైరస్ (coronavirus) కేసులు తగ్గుముఖం పట్టడంతో పలురాష్ట్రాల్లో విద్యాసంస్థలు (School Reopen)నేడు తెరచుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మంగళవారం ( ఫిబ్రవరి 1) నుండి ప్రారంభమయ్యాయి...

Schools reopening today 2022: నేటి నుంచి దేశంలో ఈ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభం.. అక్కడ ఇంకా లాక్‌డౌన్‌లోనే!
Schools Reopen
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 01, 2022 | 1:02 PM

School Reopening News In India: దేశంలో కరోనావైరస్ (coronavirus) కేసులు తగ్గుముఖం పట్టడంతో పలురాష్ట్రాల్లో విద్యాసంస్థలు (School Reopen)నేడు తెరచుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మంగళవారం ( ఫిబ్రవరి 1) నుండి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, యూపీలో పాఠశాలలు తెరవడానికి ఇంకా అనుమతి లభించలేదు. దీంతో చాలా కాలం తర్వాత పిల్లలు ఆఫ్‌లైన్ తరగతులకు (offline classes) హాజరయ్యారు. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతితో మాత్రమే విద్యార్ధులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలు తెరవబడుతున్న రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలను అనుసరించి తరగతులు జరుగుతాయి. కాగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో మార్చి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో పాఠశాలలు ఈ కింది నిబంధనలమేరకు ప్రారంభించారు. అవేంటంటే..

మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రలో ఫిబ్రవరి 1 (మంగళవారం) నుండి 50 శాతం సామర్థ్యంతో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాఠశాలల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహారాష్ట్ర మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాలలు గత వారం తెరవబడ్డాయి.

హర్యానా హర్యానాలోని నేటి నుంచి 10,11,12 తరగతులకు పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ జనవరి 25న ఈ విషయాన్ని ప్రకటించారు.

రాజస్థాన్ రాజస్థాన్‌లో కూడా నేటి నుంచి 10-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. 6 నుంచి 9 తరగతులకు,ఫిబ్రవరి 10 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి.

తెలంగాణ తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఫిబ్రవరి1 నుండి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. కాగా జనవరి 30 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆదేశించింది.

తమిళనాడు తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో 1-12 తరగతులకు ఆఫ్‌లైన్ తరగతులను తిరిగి ప్రారంభించింది. ఐతే ప్లేస్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూళ్లు మాత్రం మూసివేయాలని ఆదేశించింది.

నాగ్‌పూర్ ఈ రాష్ట్రంలో కూడా 1 నుండి 12 తరగతులకు చెందిన పాఠశాలలు, కళాశాలు ఫిబ్రవరి 1 నుండి కరోనా నిబంధనలతో కూడిన ఆఫ్‌లైన్ క్లాస్‌లను ప్రారంభించింది.

Also Read:

Teaching Jobs: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐఐటీ వడోదరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ. లక్షకు పైగా జీతం!

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన