AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teaching Jobs: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐఐటీ వడోదరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ. లక్షకు పైగా జీతం!

భారత ప్రభుత్వానికి చెందిన వడోదరలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Vadodara) ఒప్పంద ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్పెషల్ రిక్ట్రూట్‌మెంట్ (special recruitment drive) ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల..

Teaching Jobs: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐఐటీ వడోదరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ. లక్షకు పైగా జీతం!
Iiit Vadodara
Srilakshmi C
|

Updated on: Feb 01, 2022 | 12:24 PM

Share

IIIT Vadodara faculty Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన వడోదరలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Vadodara) ఒప్పంద ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్పెషల్ రిక్ట్రూట్‌మెంట్ (special recruitment drive) ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor jobs in IIIT) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 14

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.1,00,000 నుంచి రూ.1,50,000లు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Registar, International Institute of Information Technology Vadodara, block no 9, c/o govt engineering college campus, sector-28, gandhinagar, Gujarat- 382028.

దరఖాస్తు రుసుము:

  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.295
  • ఓబీసీ, ఇతర అభ్యర్దులకు రూ.590
  • మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Crime News: సంచలనం రేపుతోన్న జంటహత్యలు.. అడవిలో సగం కాలిన మృత దేహాలు! నోరు మెదపని గ్రామస్థులు..