AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: సంచలనం రేపుతోన్న జంటహత్యలు.. అడవిలో సగం కాలిన మృత దేహాలు! నోరు మెదపని గ్రామస్థులు..

జార్ఖండ్‌ (Jharkhand)లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ సమీప అడవిలో సగానికి కాలిపోయిన భార్యాభర్తల మృతదేహాలను (half burnt dead bodies) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా..

Crime News: సంచలనం రేపుతోన్న జంటహత్యలు.. అడవిలో సగం కాలిన మృత దేహాలు! నోరు మెదపని గ్రామస్థులు..
Crime News
Srilakshmi C
|

Updated on: Feb 01, 2022 | 11:58 AM

Share

జార్ఖండ్‌ (Jharkhand)లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ సమీప అడవిలో సగానికి కాలిపోయిన భార్యాభర్తల మృతదేహాలను (half burnt dead bodies) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా ఈ జంట హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంచలన కేసు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత (Naxal-affected area)టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని బొండు గ్రామంలో చోటుచేసుకుంది. మరోవైపు ఈ హత్యపై గ్రామస్థులు కూడా స్పష్టంగా స్పందించక పోవడంతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బొండూ గ్రామంలో నివసించే గోమీ కెరాయ్, అతని భార్య హత్యకు గురైనట్లు గ్రామస్థుల నుంచి పోలీసు సూపరింటెండెంట్‌కు సమాచారం అందింది. ఎస్పీ అజయ్ లిండా ఆధ్వర్యంలో ఎస్‌డీపీఓ జగన్నాథ్‌పూర్ ఇకుర్ డంగ్‌డుంగ్, ఎస్‌డీపీఓ కిరిబూరు అజిత్ కుమార్ కుజూర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆదివారం (జనవరి 30) అడవిలో సోదాలు నిర్వహించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సంచలనం రేపిన ఈ జంట హత్యల కేసులో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద నేరం ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. బొండూ గ్రామ ప్రజలు ఘటనపై సమాచారం అందించేందుకు సిద్ధంగా లేరు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని హంతకులు గ్రామస్థులను బెదిరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఘటనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ కారణంగానే పోలీసులకు సమాచారం అందడంలో జాప్యం జరిగిందని, నిజానికి జనవరి 20న హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మృతుడి సోదరుడు, మరికొందరి ప్రమేయమున్నట్లు ఎస్‌డిపిఒ కిరిబూరు అజిత్‌కుమార్‌ కుజూర్‌ తెలిపారు. మూఢనమ్మకాలు, మద్యపానం ఈ సంఘటనకు దారితీసిందని, స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని మీడియాకు వెల్లడించారు.

Also Read:

Crime News: 22 ఏళ్ల క్రితం ఇంట్లో చోరీ.. విలువైన బంగారం మాయం.. ఇన్నాళ్లకు మళ్లీ దొరికింది! దాదాపు 8 కోట్ల విలువ..

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి