SBI SCO Recruitment: ఎస్‌బీఐ ఎస్‌సీఓ పోస్టులకు అప్లై చేశారా.? ముగుస్తున్న గడువు..
SBI Recruitment: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 714 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా...
SBI Recruitment: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 714 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా, రేపటితో (20-09-2022) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 714 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* డాట్‌నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్ ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఉన్న మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్,రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా.. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్‌సైన్స్/ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)/ఎంబీఏ/పీజీ/పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధి విభాగంలో కనీసం 2 నుంచి 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 01-04-2022 వరకు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలో 100 మార్కులకు గాను 70 మార్కులు ఆన్‌లైన్ పరీక్ష నుంచి మరో 30 మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు 20-09-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..