JOBS: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ఈ కామ‌ర్స్ కంపెనీల్లో కొలువుల జాతర.. ఆకర్షణీయమైన జీతం కూడా..

చాలా మంది యువత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ మంచి ఉద్యోగం దొరికే వరకు మెయింటినెన్స్ కోసం తాత్కాలికంగా ఏదైనా ఉద్యోగం దొరికితే బాగున్ను అని కూడా చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఉద్యగమే బావుంటే కంటిన్యూ..

JOBS: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ఈ కామ‌ర్స్ కంపెనీల్లో కొలువుల జాతర.. ఆకర్షణీయమైన జీతం కూడా..
Orders Delivery
Follow us

|

Updated on: Sep 19, 2022 | 11:03 AM

Jobs: చాలా మంది యువత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ మంచి ఉద్యోగం దొరికే వరకు మెయింటినెన్స్ కోసం తాత్కాలికంగా ఏదైనా ఉద్యోగం దొరికితే బాగున్ను అని కూడా చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఉద్యగమే బావుంటే కంటిన్యూ చేసేద్దామనే ఆలోచనలోనూ చాలా మంది యువత ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్, ఫ్లిప్ కార్డ్ సంస్థలు ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 అంటే దీపావళి వరకు దాదాపు 30,000 తాత్కాలిక ఉద్యోగాలను తీసుకోనున్నట్లు సమాచారం. పండుగ సీజన్ ప్రారంభమవుతుండడంతో ఈ కామర్స్ సంస్థలు భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 అంటే దీపావళి వరకు దాదాపు 30,000 తాత్కాలిక ఉద్యోగాలను తీసుకోనున్నట్లు సమాచారం. లాజిస్టిక్స్‌లో సాఫీగా డెలివరీ జరగడం కోసం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మ్యాన్‌పవర్ అందుబాటులో ఉండడం వల్ల డెలివరీలు ఆలస్యం కాకుండా ఉంటాయని ఈ కామర్స్ సంస్థలు ఆలోచిస్తున్నాయి. దీపావళి సమయంలో ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే చాలా మంది వినియోగదారులు ఈ – షాపింగ్ చేస్తుంటారు.

లాజిస్టిక్స్ కేంద్రాలు ప్రోడక్ట్స్ రీసివ్ చేసుకోవడానికి, క్రమబద్ధీకరించడానికి, స్క్రీన్ చేయడానికి, రవాణాకు సంబంధించి రోజులో 24 గంటలూ పని చేయాల్పి ఉంటుంది. ఇక Supervisory Development Centreలు ఆర్డర్‌లను నిరంతరం ప్రాసెస్ చేస్తునే ఉంటాయి. రాత్రిళ్ళు ఆమోందించిన ఆర్డర్‌లు మరుసటి రోజు ఉదయం పంపడానికి సిద్ధం చేయాల్పి ఉంటుంది. ఈ దీపావళికి భారతదేశంలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ ఆర్డర్స్ ను వేగవంతంగా డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులను ఓ కొత్త అనుభవాన్ని ఇవ్వడం కోసం ఈ కామర్స్ సంస్థలు అప్ గ్రేడ్ అయ్యే పనిలో పడ్డాయి. దీంతో ఇప్పుడు తాత్కలికంగా ఉద్యోగాల కోసం చూసే యువతకు ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సుమారు 30వేల మందిని ఈ కామర్స్ సంస్థలు నియమించుకునేందుకు రెడీ అయ్యాయి. వీరికి ఇన్సెంటివ్ లతో కలిసి నెలకు దాదాపు రూ.30,000 వరకు సంపాదించుకోవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..