Railway Jobs 2025: రాత పరీక్షలేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో పోస్టులు ఇవే
RRC South Central Railway Jobs 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రైల్వే రీజియన్లలో.. స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత క్రీడల్లో ప్రతిభావంతమైన క్రీడాకారులకు ఈ ప్రకటన కింద ఉద్యోగాలు..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రైల్వే రీజియన్లలో.. స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత క్రీడల్లో ప్రతిభావంతమైన క్రీడాకారులకు ఈ ప్రకటన కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తం 61 పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 24, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
పోస్టులు వివరాలు ఇవే..
- లెవెల్ 3/2 సికింద్రాబాద్ కోటాలో పోస్టుల సంఖ్య: 21
- లెవెల్ 1 (హెడ్ క్వార్టర్స్ కోటా)లో పోస్టుల సంఖ్య: 10
- సికింద్రాబాద్ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
- హైదరాబాద్ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
- విజయవాడ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
- గుంటూరు డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
- గుంతకల్ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
- నాందేడ్ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులకు తప్పనిసరిగా అథ్లెటిక్స్, షెటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఖోఖో, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ తదితర క్రీడల్లో ఏదైనా ఒకదానిలో ప్రావీణ్యం ఉండాలి. దేశం, రాష్ట్రం, యూనివర్సిటీ, పాఠశాల స్థాయిలో ఏదైనా గుర్తింపు పొందిన క్రీడా పోటీలలో పాల్గొని ఉండాలి. అలాగే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనారిటీ, ఓబీసీ అభ్యర్ధులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ట్రయల్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




