RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే
వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు..

హైదరాబాద్, ఆగస్ట్ 12: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1036 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులను రైల్వే బోర్డు భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ త్వరలోనే విడుదలకానున్నాయి. అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజులు ముందుగా విడుదలవుతాయి.
ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు రాత పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ బడులకు పదో తరగతి మోమోలు వచ్చేశాయ్..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు పదో తరగతి లాంగ్ మెమోలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షలతోపాటు, జూన్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధుల మార్కుల మెమోలను ఆయా పాఠశాలలకు విద్యాశాఖ చేర్చుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల బడులకు సంబంధించిన మెమోలను పంపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రెండువేల బడులకు మెమోలను జారీ చేశారు. మిగిలిన పాఠశాలలకు త్వరలోనే పంపనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




