RBI Bank Jobs 2025: నెలకు రూ.6 లక్షల జీతంతో.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 93 ఎక్స్‌పర్ట్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు..

RBI Bank Jobs 2025: నెలకు రూ.6 లక్షల జీతంతో.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు
RBI Experts Recruitment Notification

Updated on: Dec 18, 2025 | 9:43 AM

దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 93 ఎక్స్‌పర్ట్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  1. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (DIT) విభాగంలో.. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి.

    ఇందులో..

  • డేటా సైంటిస్ట్ పోస్టులు: 2
  • ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 7
  • ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 5
  • ఏఐ/ఎంఎల్ స్పెషలిస్ట్ పోస్టులు: 3
  • ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు: 5

2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్ (DoS) ఈ విభాగంలో మొత్తం 66 పోస్టులు ఉన్నాయి.
ఇందులో..

  • మార్కెట్ & లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ పోస్టులు: 11
  • ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు: 13
  • ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 2
  • రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 5
  • బిజినెస్ & ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 6
  • డేటా సైంటిస్ట్ పోస్టులు: 4

3. ప్రిమైసెస్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 5 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీబీఏ, బీఎస్సీ, బీటెక్‌/బీఈ, ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 6, 2026వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.3,10,000 నుంచి రూ.6,00,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.