Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు… ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భువనేశ్వర్(ఒడిశా) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వివిధ డివిజన్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భువనేశ్వర్(ఒడిశా) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వివిధ డివిజన్లలో అప్రెంటిస్ పోస్టులను (Apprentice Posts) భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 756 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (190), కుర్దా రోడ్ డివిజన్ (237), వాల్తేర్ డివిజన్ (263), సంబల్‌పూర్ డివిజన్ (66) ఖాళీలు ఉన్నాయి.
* ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి అలాగే సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీ చేసిన ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 07.03.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్/సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07.03.2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడికి షాకిచ్చిన జూడో ఫెడరేషన్.. ఆ పదవి నుంచి సస్పెండ్..