DCCB Recruitment: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 57 వేలకుపైగా జీతం..
DCCB Recruitment: ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) లోని ఈ బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
DCCB Recruitment: ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) లోని ఈ బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ (07), స్టాఫ్ అసిస్టెంట్ (45) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్(ఆన్‌లైన్ ఎగ్జామ్స్)గా నిర్వహిస్తారు.
* హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 06-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..