PGCIL Recruitment 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో డిప్లొమా ట్రైనీ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL), నార్త్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్.. డిప్లొమా ట్రైనీ పోస్టుల (Diploma Trainee Posts) భర్తీకి..
Power Grid Corporation of India Limited Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL), నార్త్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్.. డిప్లొమా ట్రైనీ పోస్టుల (Diploma Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో డిప్లొమా ట్రైనీ పోస్టులు
వయోపరిమితి: ఏప్రిల్ 20, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: ట్రైనింగ్ టైంలో నెలకు రూ.27,500లు, ట్రైనింగ్ తర్వాత నెలకు రూ.1,17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
రాత పరీక్ష తేదీ: జూన్, 2022.
దరఖాస్తులకు తేదీ: ఏప్రిల్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: