CUCET 2022 – CUET 2022 రెండూ ఒక్కటేనా.. వేర్వేరా? ముఖ్య సమాచారం మీకోసం..
సీయూసెట్ (CUCET), సీయూఈటీ.. ఈ రెండూ ఒకటేనా లేదా వేరువేరా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్తగా పరిచయం చేసిన..
What is the difference between CUCET and CUET 2022: సీయూసెట్ (CUCET), సీయూఈటీ.. ఈ రెండూ ఒకటేనా లేదా వేరువేరా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్తగా పరిచయం చేసిన కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దేనిలోనైనా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి తప్పనిసరి చేస్తూ మార్చి 21న ప్రకటన విడుదల చేసింది. నిజానికి.. సీయూఈటీ అనేది సీయూసెట్‌కి పునరుద్ధరణ రూపం. అంటే సెంట్రల్ యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూసెట్)నే సీయూఈటీగా యూజీసీ పేరు మార్చిందన్నమాట. సీయూఈటీ పరీక్ష ద్వారా సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందవచ్చు. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు12వ తరగతి పరీక్షలు రాసిన వారు లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులెవరైనా ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హులు. అలాగే గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. కాగా కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022 నోటిఫికేషన్ ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ నోటిఫికేషన్‌లోనే ఎగ్జామ్ ప్యాట్రన్, సబ్జెక్ట్ ఎంపికలు, సీయూఈటీ స్కోర్ ఆధారంగా యూనివర్సిటీల్లో అడ్మిషన్ విధానం.. ఇతర అన్నివిషయాల గురించి వివరణాత్మకంగా ఉంటుంది.
Also Read: