AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2026 Free Coaching: పేదింటి విద్యార్ధులకు శుభవార్త.. గేట్‌ 2026 ఉచిత కోచింగ్‌కు ఇలా దరఖాస్తు చేసుకోండి..

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2026 పరీక్ష తేదీలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గేట్‌ 2026 పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్‌) గేట్ ప్రకటన విడుదల చేసింది..

GATE 2026 Free Coaching: పేదింటి విద్యార్ధులకు శుభవార్త.. గేట్‌ 2026 ఉచిత కోచింగ్‌కు ఇలా దరఖాస్తు చేసుకోండి..
NIT Warangal GATE 2026 free coaching
Srilakshmi C
|

Updated on: Nov 12, 2025 | 5:43 PM

Share

వరంగల్‌, నవంబర్‌ 12: దేశవ్యాప్తంగా ఎంటెక్, పీహెచ్‌డీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2026 పరీక్ష తేదీలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్‌ 2026 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. అయితే గేట్‌ 2026 పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్‌) గేట్ ప్రకటన విడుదల చేసింది.

ఈ కార్యక్రమానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత కోచింగ్‌కు ఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థులతో పాటు.. వరంగల్, చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంతో కఠినమైన గేట్‌ (GATE 2026) పరీక్ష కోసం 8 వారాల ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. ఈ ఉచిత కోచింగ్‌ ప్రక్రియ నవంబర్ 17న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ మేరకు ఎన్‌ఐటీ వరంగల్ తన ప్రకటనలో పేర్కొంది. ఆదివారాలు మినహా ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని ఎన్‌ఐటీ వరంగల్‌ వివరించింది.

ఎన్‌ఐటీ వరంగల్‌లో గేట్‌-2026 ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎంజీయూ డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ 2025 విడుదల.. రేపట్నుంచే పరీక్షలు

నల్గొండలోని మహాత్మ గాంధీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ 1, 3, 5 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు నవంబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 1 వరకు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మొత్తం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మహాత్మ గాంధీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.