యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్ధులకు సీఎం రేవంత్ తీపికబురు.. వారికి మరో రూ.లక్ష చొప్పున సాయం!
43 Telangana Candidates Qualify For UPSC Interviews: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (CSE 2025) మెయిన్ ఫలితాలు బుధవారం (నవంబర్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి మొత్తం 2,736 మంది అభ్యర్థులు హాజరైనట్లు యూపిఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి..

హైదరాబాద్, నవంబర్ 12: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (CSE 2025) మెయిన్ ఫలితాలు బుధవారం (నవంబర్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి మొత్తం 2,736 మంది అభ్యర్థులు హాజరైనట్లు యూపిఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు గత ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది కూడా ఈ పథకం కింద సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది.
రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరందరికీ గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




