నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026లో భారీగా జాబ్ ఆఫర్స్! ఈ స్కిల్స్ ఉన్న వారికే ఫుల్ డిమాండ్..
Job market in India on road to recovery in 2026: వచ్చే ఏడాది పెరగనున్న నియామకాలు చురుకైన శ్రామిక శక్తి (యాక్టివ్ వర్క్‌ఫోర్స్) విస్తరణకు దారితీస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలో ఉపాధి అవకాశాలకు చేయూతనిస్తున్నాయి. ఇందులో ఏకంగా 20 శాతం నియామకాలతో ముందంజలో ఉంది..

హైదరాబాద్, నవంబర్ 12: దేశంలో 2026 నాటికి ఉద్యోగ నియామకాలు 11 శాతానికి పెరగనున్నాయి. ప్రస్తుతం 2025 ఏడాదిలో ఉపాది కల్పనలు 9.75 శాతంగా ఉన్నట్లు తాజా నివేదిక మంగళవారం (నవంబర్ 11) వెల్లడించింది. వచ్చే ఏడాది పెరగనున్న నియామకాలు చురుకైన శ్రామిక శక్తి (యాక్టివ్ వర్క్‌ఫోర్స్) విస్తరణకు దారితీస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలో ఉపాధి అవకాశాలకు చేయూతనిస్తున్నాయి. ఇందులో ఏకంగా 20 శాతం నియామకాలతో ముందంజలో ఉంది. ఇక మెటల్, మైనింగ్, పవర్, యుటిలిటీస్, స్టీల్, సిమెంట్ వంటి ఇతర ప్రధాన పరిశ్రమల్లో 12 శాతం మేర ఉన్నట్లు ట్యాగ్‌జిడి నివేదిక పేర్కొంది.
2026 సంవత్సరం అనుభవజ్ఞులైన నిపుణుల సంవత్సరంగా ఆవిర్భవించనున్నట్లు నివేదిక తెలిపింది. ఎందుకంటే పలు కంపెనీలు మధ్య, సీనియర్ స్థాయి నిపుణులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ధోరణి అనుభవ స్థాయి ఆధారంగా నియామకాలకు దారి తీయనున్నట్లు తెలిపింది. మొత్తం నియామకాల్లో 6 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు 55 శాతం ఉంటారని అంచనా. ఇది గత ఏడాదిగా కేవలం 39 శాతంగా మాత్రమే ఉంది.
6–10 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల నియామకాలు 28 శాతానికి (గత ఏడాది 26 శాతంగా ఉంది) పెరుగుతాయని అంచనా. అలాగే 11 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి 15 శాతం (గత ఏడాది ఇది 9 శాతంగా ఉంది), 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారికి ఉపాది అవకాశం 12 శాతానికి (గత ఏడాది ఇది 4 శాతంగా ఉంది) పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికే కాకుండా ఫ్రెషర్స్‌కు కూడా వచ్చే ఏడాది ఉపాదికల్పనలో ఆశావహకంగానే ఉంది. కెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణుల (0– ఐదేళ్లు)కు ఉపాధి నియామకాల్లో 45 శాతం డిమాండ్ ఉండే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా 2026 వచ్చే ఉద్యోగాల్లో 32 శాతం టైర్ 2 నగరాల్లో భర్తీకానున్నాయి. ఇక టైర్ 1 నగరాల్లో 53 శాతం, టైర్ 3 నగరాల్లో 15 శాతం ఉపాది లభించే అవకాశం ఉందని అంచనా. ఇది ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు మించి దేశంలోని జాబ్ మార్కెట్‌ను ప్రతిబింబిస్తుంది. 2026లో జాబ్ మార్కెట్ పునరుద్ధరణకు ఇది స్పష్టమైన సంకేతాలను చూపుతోంది. ఒక ఏడాది పాటు నిదానంగా ఒకే సంఖ్యలో వృద్ధి కొనసాగినప్పటికీ ఉద్యోగ నియామకాలు గత ఏడాది 9.75 శాతం నుంచి 11 శాతానికి తిరిగి పుంజుకున్నాయని టాగ్డ్ కో ఫౌండర్, CEO దేవాశిష్ శర్మ అభిప్రాయపడ్డారు.
మరోవైపు AI టెక్నాలజీ ప్రతిభకు డిమాండ్ పోరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో AI ప్రతిభ ఉన్నవారి సంఖ్య 23.5 లక్షల మంది వరకు ఉన్నట్లు. ఇది ఏడాదికి 55 శాతం చొప్పున పెరుగుతోంది. ఇక 2026కి డిమాండ్ ఉన్న నైపుణ్యాల విషయానికొస్తే డిజిటల్ & డేటా స్పెషలిస్టులు, AI/ML ఇంజనీర్లు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌లు, సస్టైనబిలిటీ స్పెషలిస్ట్‌లతో పాటు GenAI, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలలో నైపుణ్యం కలిగిన వారికి యమ డిమాండ్ ఉంటుంది. అనుకూలత, సమస్య పరిష్కారం, కాగ్నిటివ్ స్కిల్స్, సహకారం, నిర్వహణ, ఎంగేజ్‌మెంట్, స్వీయ-సమర్థత, ఎథిక్స్ వంటి నైపుణ్యాలు ఎప్పటి మాదిరిగానే ఉద్యోగార్జనలో కీలకం కానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




