NIRDPR Hyderabad Jobs 2022: రాత పరీక్షలేకుండా బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్.. ఒప్పంద ప్రాతిపదికన డైరెక్టర్ (ఎంఐఎస్‌), సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్, పీహెచ్‌పీ డెవలపర్ తదితర పోస్టుల భర్తీకి..

NIRDPR Hyderabad Jobs 2022: రాత పరీక్షలేకుండా బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
NIRDPR Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2022 | 7:18 AM

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్.. ఒప్పంద ప్రాతిపదికన 13 డైరెక్టర్ (ఎంఐఎస్‌), సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్, పీహెచ్‌పీ డెవలపర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేది ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ , సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 3వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • డైరెక్టర్ (ఎంఐఎస్‌) పోస్టులు: 1
  • సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టులు: 3
  • పీహెచ్‌పీ డెవలపర్ పోస్టులు: 2
  • సీనియర్ పైథాన్ డెవలపర్ పోస్టులు: 2
  • కేబీ టెక్ సపోర్ట్ టీమ్ పోస్టులు: 5

అడ్రస్‌: National Institute Of Rural Development &Panchayati Raj, Rajendranagar, Hyderabad -500 030.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.