SSC Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 990 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? 2 రోజులే గడువు..

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారత వాతావరణ శాఖలోని.. 990 గ్రూప్ 'బి' సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు..

SSC Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 990 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? 2 రోజులే గడువు..
SSC Scientific Assistant Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 16, 2022 | 8:43 PM

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారత వాతావరణ శాఖలోని.. 990 గ్రూప్ ‘బి’ సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్‌ 18, 2022వ తేదీ రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, భౌతికశాస్త్రం/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 18, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్‌ ఫీజు చెల్లింపులకు చివరి తేది అక్టోబర్ 20, 2022. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్ 2022 నెలలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష పార్ట్‌ -1, పార్ట్‌ -2లుగా నిర్వహిస్తారు. ఈ రెండింటికి కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పార్ట్‌-1లో..

జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు క్వాంటిటేవిట్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పార్ట్‌-2లో..

ఫిజిక్స్ / కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ రెండు విభాగాలకు ఒకేసారి పరీక్ష జరుగుతుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.