NILD Kolkata Recruitment 2022: బీఎస్సీ/ఎంఫిల్‌ అర్హతతో 80 వేల జీతంతో ఎన్‌ఐఎల్డీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ (NILD) దేశంలోని వివిధ సెంటర్లలో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NILD Kolkata Recruitment 2022: బీఎస్సీ/ఎంఫిల్‌ అర్హతతో 80 వేల జీతంతో ఎన్‌ఐఎల్డీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Nild
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 16, 2022 | 8:45 AM

NILD Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ (NILD) దేశంలోని వివిధ సెంటర్లలో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌, డైరెక్టర్‌, క్లినికల్‌ అసిస్టెంట్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఓరియెంటెషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌, లెక్చరర్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విభాగాలు: పీఎం అండ్‌ ఆర్‌, క్లినికల్‌ సైకాలజీ, ఎంఆర్‌, హెచ్‌ఐ, ఈ1 యూనిట్‌ పట్నా, స్పీట్‌ అండ్ హియరింగ్‌ తదితర విభాగాలు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.25,000ల నుంచి 80,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్‌, బీఆర్‌ఎస్‌/తత్సమాన డిగ్రీ, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్‌, ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Director, National Institute for Locomotor Disabilities(Divyangjan), B.T. Road, Bon-Hooghly, Kolkata-700090.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICSE, ISC Term 2 Exams 2022: ఏప్రిల్ చివరి వారం నుంచి టర్మ్‌ 2 పరీక్షలు.. త్వరలో డేట్‌షీట్‌..