NHAI Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) , హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.. తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెనల్స్ (టెక్నాలజీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 9
ఖాళీల వివరాలు: యంగ్ ప్రొఫెనల్స్ (టెక్నాలజీ)
అర్హతలు: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వాలిడ్ గేట్ 2021 స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 60,000లు నెలకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2021 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: National Highways Authority of India Regional Office – Hyderabad, Administrative Staff college of India, 1st floor, New Building, college park campus-road no-3, Banjarahills, Hyderabad- 500034.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: