BECIL Jobs: అంబేడ్కర్ యూనివర్సిటీలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. ఢిల్లీ డాక్టర్ బీఆర్ అండేద్కర్ యూనివర్సిటీ (Delhi AUD)లో తాత్కాలిక ప్రాతిపదికన సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

BECIL Jobs: అంబేడ్కర్ యూనివర్సిటీలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..
Becil
Follow us

|

Updated on: Jan 28, 2022 | 8:10 PM

BECIL – Delhi AUD Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. ఢిల్లీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (Delhi AUD)లో తాత్కాలిక ప్రాతిపదికన సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 4

ఖాళీల వివరాలు: సెక్షన్ ఆఫీసర్

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యయేషన్/పోస్టు గ్రాడ్యయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: రూ. 53,000లు నెలకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Wipro hiring 2022: విప్రో బంపర్ ఆఫర్..! కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..