NGRI Recruitment: నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోల భర్తీ.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
NGRI Recruitment: సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం...
NGRI Recruitment: సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రోమాగ్నటిక్ జియోఫిజిక్స్, సెసిమిక్/ సెస్మాలజీ, గ్రావిటీ/ జీపీఎస్ వంటి విభాగాల్లో సైటింస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 32 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకాడమిక్ అర్హత ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతరులు మాత్రం రూ. 100 చెల్లించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,16,398 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 07-12-2021న ప్రారంభమైన, 07-01-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Priyanka Chopra: క్రిస్మస్ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన ప్రియాంక..