NFL Recruitment: బీటెక్ అర్హతతో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెంది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం...
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ (01), టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్) (03), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ (02), స్టేషన్ ఆఫీసర్/ ఎ (07), సబ్-ఆఫీసర్/ బి (28), డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ (83) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 10+2, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 10-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..