NEET-PG Revised Exam Date: వారంలో నీట్‌ పీజీ 2024 పరీక్ష తేదీ వెల్లడి.. పరీక్షకు 2 గంటల ముందు క్వశ్చన్‌ పేపర్‌ రెడీ!

నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ 2024 పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. పరీక్ష నిర్వహణకు కేవలం కొన్ని గంటల ముందే ఈ మేరకు నిర్ణయం తీసుకుని లక్షలాది మంది విద్యార్ధులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. అయితే ఈ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు..

NEET-PG Revised Exam Date: వారంలో నీట్‌ పీజీ 2024 పరీక్ష తేదీ వెల్లడి.. పరీక్షకు 2 గంటల ముందు క్వశ్చన్‌ పేపర్‌ రెడీ!
NEET-PG Revised Exam
Follow us

|

Updated on: Jul 02, 2024 | 5:01 PM

న్యూఢిల్లీ, జులై 2: నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ 2024 పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. పరీక్ష నిర్వహణకు కేవలం కొన్ని గంటల ముందే ఈ మేరకు నిర్ణయం తీసుకుని లక్షలాది మంది విద్యార్ధులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. అయితే ఈ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కుదిరితే ఈ నెలాఖరు లేదంటే ఆగస్టులో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌ ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. పరీక్షలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు చివరి 2 గంటల్లో మాత్రమే ప్రశ్నపత్రాలను సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

నీట్‌ పీజీ 2024 రివైజ్డ్‌ షెడ్యూల్‌ను జులై 2న ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చినా.. పరీక్ష తేదీని నేడు వెల్లడించలేమని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) తెలిపింది. తాము సిద్ధం చేసిన పరీక్ష షెడ్యూల్‌ను కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే షెడ్యూల్‌ ప్రకటిస్తామని వెల్లడించింది. జులై చివర్లోగానీ, ఆగస్టులో గానీ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొ్ంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జులై 5లోగా వెల్లడించనుంది.

మరోవైపు పరీక్ష జరిగిన గంటల వ్యవధిలోనే యూజీసీ నెట్‌ 2024 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను ఎన్‌టీయే ఇటీవల ప్రకటించింది. జూలై 25-27 మధ్య యూజీపీ నెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. గతంలో మాదిరి పెన్ను, పేపర్‌కు బదులుగా ఈ సారి ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.