NEET 2021: నీట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ తేదీ ఎప్పటి నుంచి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..

NEET 2021 Exmaination: ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ 2021 పరీక్ష అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) నిర్వహించే ఈ పరీక్షకు అడ్మిట్‌ కార్డులను ఏప్రిల్‌ 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

NEET 2021: నీట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ తేదీ ఎప్పటి నుంచి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..
Neet Exam
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 06, 2021 | 2:03 PM

NEET 2021 Exmaination: ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ 2021 పరీక్ష అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) నిర్వహించే ఈ పరీక్షకు అడ్మిట్‌ కార్డులను ఏప్రిల్‌ 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నీట్‌ 2021 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఐడెంటింటి కార్డు పరీక్షా సెంటర్‌కు తీసుకురావాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఈ అడ్మిట్‌ కార్డుపై సరైన ఎగ్జామ్‌ లొకేషన్‌ అడ్రస్‌ను అందిస్తారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు సరిగా నడవకపోవడంతో అర్హత మార్కులను 200లకు తగ్గించిన విషయం తెలిసిందే.

అడ్మిట్‌ కార్డును ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..

* ముందుగా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) అధికారిక వెబ్‌సైట్‌ nbe.edu.inలోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘నీట్‌ పీజీ 2021 అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌’ను క్లిక్‌ చేయాలి. (ఏప్రిల్‌ 12 తర్వాత లింక్ యాక్టివేట్‌ అవుతుంది)

* ఆ లింక్ క్లిక్‌ చేయగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

* తర్వాత లాగిన్‌ వివరాలతో పాటు పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి.

* వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్‌ కార్డు డిస్‌ప్లే అవుతుంది.

* భవిష్యత్తు అవసరాల కోసం అడ్మిట్‌ కార్డును ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.

Also Read: Pariksha Pe Charcha 2021: ఈ నెల 7న ‘పరీక్షా పే చర్చ’.. వీక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..

RRC NCR Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్

BHEL Jobs 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వివిధ విభాగాల్లో 389 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..