BHEL Jobs 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వివిధ విభాగాల్లో 389 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

BHEL Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌,...

BHEL Jobs 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వివిధ విభాగాల్లో 389 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..
reliance jio jobs
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 11:32 AM

BHEL Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌, ట్రేడ్‌ అప్రెంటీస్‌, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 389 ఖాళీలున్నాయి. తిరుచ్చిరాపల్లిలోని బీహెచ్ఈఎల్‌ యూనిట్‌లోఈ పోస్టులు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్‌ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను https://trichy.bhel.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 389

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 66 మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 44 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 6 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 2 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 7 సివిల్ ఇంజనీరింగ్- 6 కెమికల్ ఇంజనీరింగ్- 1

ట్రేడ్ అప్రెంటీస్- 253

ఫిట్టర్- 115 టర్నర్- 7 వెల్డర్- 58 ఎలక్ట్రీషియన్- 26 మెషినిస్ట్- 12 ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2 ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్- 2 వైర్‌మెన్- 2 ఎలక్ట్రానిక్ మెకానిక్- 2 డీజిల్ మెకానిక్- 3 ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 8 కార్పెంటర్- 2 ప్లంబర్- 2 మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8 అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్సెస్)- 2 అకౌంటెంట్- 4 ఎంఎల్‌టీ ప్యాథాలజీ- 1

టెక్నీషియన్ అప్రెంటీస్- 70

మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 49 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 8 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 5 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2 సివిల్ ఇంజనీరింగ్- 6

దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14 ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 16 సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2021 ఏప్రిల్ 21

అర్హతలు :

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

Amazon Free Coaching: జేఈఈ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారా.? అయితే గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా కోచింగ్‌..

CCMB Recruitment: ఇంటర్‌ విద్యార్హత, ఇంగ్లిష్‌ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలంటే..