NCSM Jobs 2022: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (NCSM) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
NCSM Recruitment 2022: భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (NCSM) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు:
- క్యురేటర్ బి పోస్టులు: 5
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు: 1
- సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 2
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-I పోస్టులు: 1
అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- క్యురేటర్ బి పోస్టులకు: రూ.500
- ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-I పోస్టులకు: రూ.300
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: