NCS Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. నేషనల్ కెరీర్‌ సర్వీస్‌లో 112 ఉద్యోగాలు! పూర్తివివరాలు..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కెరీర్‌ సర్వీస్‌ (NCS).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌..

NCS Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. నేషనల్ కెరీర్‌ సర్వీస్‌లో 112 ఉద్యోగాలు! పూర్తివివరాలు..
Ncs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 12:53 PM

NCS Noida Young Professionals Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కెరీర్‌ సర్వీస్‌ (NCS).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professionals Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 112

పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 4 సంవత్సరాల పాటు అనుభవం ఉండాలి. లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

MP quota in KV 2022 admissions: కేంద్రీయ విద్యాలయాల్లో రద్దుకానున్న ఎంపీ కోటా! ఎందుకో తెలుసా..