BARC Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో.. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో 266 ఉద్యోగాలు!
భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పరిధిలోని నూక్లియర్ రీసైకిల్ బోర్డులు..
BARC Stipendiary Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పరిధిలోని నూక్లియర్ రీసైకిల్ బోర్డులు అయిన తారాపూర్, కల్పకంలలో స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 266
పోస్టుల వివరాలు:
- స్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 1 పోస్టులు: 71
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎటక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: మొదటి ఏడాది నెలకు రూ.16,000, రెండో ఏడాది నెలకు రూ.18,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (కెమిస్ట్రీ)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- స్టైపెండరీ ట్రైనీ కేటగిరి – 2 పోస్టులు: 189
ట్రేడులు: ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్ ఆపరేటర్ తదితర ట్రేడులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సైంటిఫిక్ అసిస్టెంట్ బి (సేఫ్టీ): 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.35,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- టెక్నీషియన్ బి (లైబ్రరీ సైన్స్): 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
- టెక్నీషియన్ బి (రిగ్గర్): 4
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే రిగ్గర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చెయ్యండి.
Also Read: