MP quota in KV 2022 admissions: కేంద్రీయ విద్యాలయాల్లో రద్దుకానున్న ఎంపీ కోటా! ఎందుకో తెలుసా..

కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలో ఎంపీ కోటా ప్రాధాన్యత ఏమిటో? అసలెందుకు కేంద్రం ఎంపీ కోటాను రద్దుచేయాలనుకుంటుందో? ఆ సమాచారం మీకోసం..

MP quota in KV 2022 admissions: కేంద్రీయ విద్యాలయాల్లో రద్దుకానున్న ఎంపీ కోటా! ఎందుకో తెలుసా..
Scrap Mp Quota In Kvs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 12:40 PM

Centre to Scrap MP quota in Kendriya Vidyalayas : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది? ఏయే రిజర్వేషన్‌ కోటాల కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మీకు తెలుసా? కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలో ఎంపీ కోటా ప్రాధాన్యత ఏమిటో? అసలెందుకు కేంద్రం ఎంపీ కోటాను రద్దుచేయాలనుకుంటుందో? ఆ సమాచారం మీకోసం..

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 1.75 లక్షల మంది విద్యార్థులు దేశంలోని పలు కేంద్రీయ విద్యాలయ (KV Admissions)ల్లో ప్రవేశం పొందినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన డేటాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Education Minister Dharmendra Pradhan) ఈ ఏడాది (2022) ఫిబ్రవరి 7న లోక్‌సభలో సమర్పించారు. ఈ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా..

గత ఏడేళ్లలో కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్‌ కింద అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు ఎందరంటే..

నిజానికి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు వివిధ రిజర్వేషన్ల ప్రకారం కొనసాగుతాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం 2021-22 విద్యా సంవత్సరంలో దాదాపు 1.75 లక్షల మంది విద్యార్థులు రిజర్వేషన్‌ ద్వారా ప్రవేశాలు పొందారు. అంతకుముందు విద్యా సంవత్సరంలో (2020-21) అత్యధికంగా 1.95 లక్షలకుపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అలాగే 2019-22లో 1.92 లక్షల విద్యార్ధుర్లు ప్రవేశాలు పొందారు. ఇక ప్రస్తుత విద్యా సంవత్సర (2022-23) విషయానికొస్తే కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల సంఖ్య దాదాపు13 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడేళ్లలో మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు రిజర్వేషన్‌ ద్వారా లబ్ధి పొందారు. ఈ ఏడేళ్లలో 1.7 లక్షల కంటే తక్కువ అడ్మిషన్లు ఏ విద్యాసంవత్సరంలో కూడా నమోదుకాలేదు. అంతేకాకుండా కరోనా మహమ్మారి కల్లోలకాలంలో (2019-20, 2020-21) దేశంలోని పలు కేంద్రీయ విద్యాలయాల్లో గరిష్ఠ స్థాయిలో అడ్మిషన్లు పొందటం గమనార్హం.

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా ప్రాధాన్యత ఏమిటీ?

నిజానికి ప్రతి విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశాల్లో గరిష్టంగా 10 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అధికారం ప్రతి నియోజకవర్గంలోని ఎంపీ (Member of Parliament)కి ఉంటుంది. ఐతే సదరు విద్యార్ధులు సంబంధిత ఎంపీ నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. అదేవిధంగా ఎంపీలు తమ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయాలు లేనిపక్షంలో పక్క నియోజకవర్గంలోని కేవీ పాఠశాలకు సిఫార్సు చేయవచ్చు. లోక్‌సభ ఎంపీలు మాత్రమేకాకుండా రాజ్యసభ ఎంపీలకు కూడా ఈ విధమైన అధికారం ఉంటుంది.

ఎంపీ కోటాలో మాత్రమేకాకుండా ఇతర కోటాల ద్వారా కూడా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎలాగంటే.. స్పోర్ట్స్‌, జాతీయ అవార్డులు పొందిన ప్రతిభావంతులైన పిల్లలు, అలాగే మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందడానికి కొన్ని కోటాలు అందుబాటులో ఉన్నాయి.

ఐతే ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ కోటా సీట్లపై చర్చలు సాగుతున్నాయి.

దేశంలో రాష్ట్రాలవారీగా కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే..

విద్యాశాఖ సమర్పించిన తాజా డేటా ప్రకారం.. దేశంలో మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 104 కేవీ పాఠశాలలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 95 ఉండగా, రాజస్థాన్‌లో 68 కేంద్రీయ విద్యాలయాలున్నాయి. ఇక 50కి పైగా కేవీ పాఠశాలలున్న రాష్ట్రాలు నాలుగున్నాయి. అవేంటంటే.. మహారాష్ట్రలో 59, పశ్చిమ బెంగాల్‌లో 58, అస్సాంలో 55, ఒడిశాలో 53 పాఠశాలలున్నాయి.

అస్సాం మినహా మిగతా 7 ఈశాన్య రాష్ట్రాల్లో 47 కేవీ పాఠశాలున్నాయి. కొత్తగా ఏర్పడిన లడఖ్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కేంద్రీయ విద్యాలయాలున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 41 ఉన్నాయి. డేటా ప్రకారం ఈ సంఖ్య తమిళనాడులో ఉన్న కేవీల కంటే ఎక్కువే.

40 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో సీట్ల రిజర్వేషన్ ఇలా..

ఒక తరగతిలోని మొత్తం 40 సీట్లలో.. 30 రిజర్వేషన్‌ సీట్లు, 10 జనరల్ సీట్లు ఉంటాయి. వీటిలో.. ఎస్సీ విద్యార్థులకు 6, ఎస్టీ విద్యార్థులకు 3 రిజర్వేషన్‌ సీట్లు ఉంటాయి. వీటితో పాటు ఓబీసీ విద్యార్ధులకు 11 ర్వేషన్‌ సీట్లు, విద్యా హక్కు కోటా కింద 25 శాతం (10 సీట్లు) ఉంటాయి. మిగిలిన 10 సీట్లు రిజర్వేషన్‌ పరిధిలోకిరాని జనరల్‌ కోటా విద్యార్థుల కోసం కేటాయింపు ఉంటుంది.

Also Read:

SAI Recruitment 2022: రూ. లక్షకుపైగా జీతంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!