AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT Free Online Courses: 11, 12 తరగతులకు SWAYAM ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు.. రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి SWAYAM ప్లాట్‌ఫామ్ ఉచిత మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (MOOC)లను అందిస్తోంది. ఈ ఆన్‌లైన్ సపోర్ట్ కోర్సులను 11, 12 తరగతుల విద్యార్థులకు అందించనుంది. అభ్యాస అంతరాలను తగ్గించడం, దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యా వనరులకు సమాన ప్రాప్యతను అందించడం..

NCERT Free Online Courses: 11, 12 తరగతులకు SWAYAM ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు.. రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఇదే
NCERT Offers Free Online Courses
Srilakshmi C
|

Updated on: Aug 03, 2025 | 12:55 PM

Share

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి SWAYAM ప్లాట్‌ఫామ్ ఉచిత మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (MOOC)లను అందిస్తోంది. ఈ ఆన్‌లైన్ సపోర్ట్ కోర్సులను 11, 12 తరగతుల విద్యార్థులకు అందించనుంది. అభ్యాస అంతరాలను తగ్గించడం, దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యా వనరులకు సమాన ప్రాప్యతను అందించడం లక్ష్యంగా వీటిని తీసుకువచ్చారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని SWAYAM వెబ్‌సైట్‌ ద్వారా పాఠశాల స్థాయి MOOCలను (9-12 తరగతులు) అభివృద్ధి చేయడానికి, వ్యాప్తి చేయడానికి NCERT.. జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. SWAYAM వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటి ద్వారా ఈ ఆన్‌లైన్‌ కోర్సులను యాక్సెస్ చేసుకోవచ్చు.

కోర్సులో ఏమేం అందిస్తారంటే..

  • అనుభవజ్ఞులైన విద్యావేత్తల వీడియో ఉపన్యాసాలు
  • ఆఫ్‌లైన్ స్టడీ కోసం ముద్రిత స్టడీ మెటీరియల్‌
  • క్విజ్‌లు, అసైన్‌మెంట్‌ల వంటి స్వీయ-అంచనా పరీక్షలు
  • సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆన్‌లైన్ చర్చా వేదికలు
  • ఈ వెబ్‌సైట్‌లో కోర్సు కంటెంట్ 24×7 అందుబాటులో ఉంటుంది. చర్చా బోర్డులు, నిపుణుల అభిప్రాయం వంటి ఇంటరాక్టివ్ సెషన్స్‌ కూడా ఉంటాయి.

విద్యార్థులు ఈ కోర్సులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. తుది మూల్యాంకనం విజయవంతంగా పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2025.
  • కోర్సులు ప్రారంభ తేదీ: మే 1, 2025 నుంచి
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2025.
  • పరీక్ష రిజిస్ట్రేషన్ విండో ప్రారంభ తేదీలు: సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు, 2025
  • ఫైనల్‌ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు, 2025
  • కోర్సు ముగింపు తేదీ: సెప్టెంబర్ 15, 2025.

కోర్సులలో ఎలా చేరాలి..

  • SWAYAM అధికారిక పోర్టల్‌ను swayam.gov.in సందర్శించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • సంబంధిత సబ్జెక్టు పేజీని యాక్సెస్ చేయడానికి కోర్సు లింక్‌ని ఉపయోగించాలి.
  • కావలసిన కోర్సు ఎంపిక చేసుకుని ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
  • కంటెంట్‌ను అధ్యయనం చేసి, అవసరమైన అన్ని వివరాలు పూరించి సబ్‌మిట్‌ చేసుకోవాలి.

11వ తరగతికి అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే..

  • అకౌంటెన్సీ (పార్ట్-I)
  • బయాలజీ (పార్ట్ I & II)
  • బిజినెట్‌ స్టడీస్‌ (పార్ట్-I)
  • కెమిస్ట్రీ (పార్ట్స్ I & II)
  • ఎకనామిక్స్‌ (పార్ట్-I)త
  • జాగ్రఫీ (పార్ట్ I & II)
  • మ్యాథమెటిక్స్‌ (పార్ట్ I & II)
  • ఫిజిక్స్‌ (పార్ట్ I & II)
  • సైకాలజీ (పార్ట్ I & II)
  • సోషియాలజీ (పార్ట్-I)

12వ తరగతికి అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే..

  • బయాలజీ (పార్ట్-I)
  • బిజినెట్‌ స్టడీస్‌ (పార్ట్-I)
  • కెమిస్ట్రీ (పార్ట్-I)
  • ఎకనామిక్స్‌ (పార్ట్-I)
  • ఇంగ్లీష్ (పార్ట్-I – APPEAR)
  • జాగ్రఫీ (పార్ట్ I & II)
  • మ్యాథమెటిక్స్‌ (పార్ట్-I)
  • ఫిజిక్స్‌ (పార్ట్ I & II)
  • సైకాలజీ (పార్ట్-I)
  • సోషియాలజీ (పార్ట్-I)

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.