Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్ పోస్టులు..

నవోదయ విద్యాలయాల్లో ఉన్న మొత్తం 1377 నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌, ఎలక్ట్రిషియన్‌, ప్లంబర్‌, మెస్‌ హెల్పర్‌, ఎమ్‌టీస్‌తో పాటు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పోస్టుల ఆధారంగా...

Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్ పోస్టులు..
Navodaya School Jobs
Follow us

|

Updated on: Apr 29, 2024 | 2:18 PM

కేంద్ర ప్రభుత్వ రంగ విద్య సంస్థ అయిన నవోదయ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఈ విద్యా సంస్థలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు నవోదయ విద్యాలయాల్లో ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొత్తం 1377 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నవోదయ విద్యాలయాల్లో ఉన్న మొత్తం 1377 నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌, ఎలక్ట్రిషియన్‌, ప్లంబర్‌, మెస్‌ హెల్పర్‌, ఎమ్‌టీస్‌తో పాటు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పోస్టుల ఆధారంగా పదో తరగతి, 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్‌ సెంటర్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంగనగర్‌, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
వచ్చేవారంలోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు..!
వచ్చేవారంలోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు..!
గంటలో 50 వేల కార్లు బుకింగ్స్‌.. దుమ్మురేపుతోన్న మహీంద్ర కారు..
గంటలో 50 వేల కార్లు బుకింగ్స్‌.. దుమ్మురేపుతోన్న మహీంద్ర కారు..
కంటిన్యూ అవ్వనన్న ద్రవిడ్.. నో చెప్పిన లక్ష్మణ్..
కంటిన్యూ అవ్వనన్న ద్రవిడ్.. నో చెప్పిన లక్ష్మణ్..
నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ టెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
దూసుకుపోతున్న బంగారం ధరలు.. సరికొత్త మార్కును చేరుకున్న గోల్డ్
దూసుకుపోతున్న బంగారం ధరలు.. సరికొత్త మార్కును చేరుకున్న గోల్డ్
Horoscope Today: ఆ రాశివారికి మనసులోని కోరిక నెరవేరుతుంది..
Horoscope Today: ఆ రాశివారికి మనసులోని కోరిక నెరవేరుతుంది..
డైనమిక్ డైరెక్షన్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన తేజా సజ్జా..
డైనమిక్ డైరెక్షన్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన తేజా సజ్జా..
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. మెహ్రీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. మెహ్రీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.