Bank Jobs 2022: బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? నైనిటాల్ బ్యాంక్‌లో100 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వెంటనే..
నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (management trainee jobs), క్లర్క్ (clerk)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..
Nainital Bank Recruitment 2022: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ (Nainital Bank) అనేది ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్.. నార్త్ ఇండియాలోని ఈ 5 రాష్ట్రాల్లో 164 శాఖల నెట్‌వర్క్‌తో హల్ద్వానీ, డెహ్రాడూన్, నోయిడాల్లో 3 చొప్పున ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది. నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (management trainee jobs), క్లర్క్ (clerk)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 100
ఖాళీల వివరాలు:
- మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు: 50
- క్లర్క్ పోస్టులు: 50
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: