కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలరవాణా విభాగంలో మొత్తం10,208 ఖాళీలు.. అప్పటి వరకు ఎదురుచూపే!
దేశంలోని పోర్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలున్నట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ (Sharbanand Sonowal) రాజ్యసభ (Rajya Sabha)లో తెలిపారు..
Sharbanand Sonowal: దేశంలోని పోర్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలున్నట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ (Sharbanand Sonowal) రాజ్యసభ (Rajya Sabha)లో తెలిపారు. మొత్తం 11 మేజర్ పోర్టులలో 10,208 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిలో విశాఖ పోర్టులో 982 ఖాళీలున్నాయన్నారు. ఐతే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, యాంత్రీకరణ కారణంగా ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యే అవసరాన్ని మించి ఉన్నట్టు తెలిపారు. దీంతో ప్రైవేటు పోర్టులతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ రంగ పోర్టుల నిర్వహణా వ్యయం బాగా పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని పోర్టులలో ఎంతమేర సిబ్బంది అవసరమనే విషయంపై అధ్యయనం చేయడానికి ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ కేపీఎమ్జీ (KPMG) సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. అధ్యయన రిపోర్టు వెల్లడించగానే ఖాళీల భర్తీ ప్రక్రియపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Also Read: